లక్కు.. కిక్కు ఎవరికో..!

Tue,October 8, 2019 01:20 AM

-రేపటి నుంచి 16వరకు దరఖాస్తుల స్వీకరణ
-18న లక్కీడ్రా ద్వారా ఎంపిక
-జిల్లాలో 40 మద్యం దుకాణాలు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 40 మద్యం దుకాణాలకు ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2019-2021 సంవత్సరానికి సంబంధించి (1-11-2019 నుంచి 31-10-2021) రెండు సంవత్సరాల లీజు కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. 13న (ఆదివారం) దరఖాస్తులు స్వీకరించమని స్పష్టం చేశారు. మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి -కామారెడ్డి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు రూ.2 లక్షల డిపాజిట్, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, పాన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులు దరఖాస్తుకు జత చేయాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అందజేయనున్నట్లు తెలిపారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles