గర్గుల్‌లో సామూహిక సీమంతాలు

Sun,September 15, 2019 12:45 AM

కామారెడ్డి రూరల్ : మండలంలోని గర్గుల్ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం-16లో శనివారం సామూహిక సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్ కవితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. గర్భిణులు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ సురేఖ, వార్డు సభ్యురాలు నాగరాణి, వీవోలు లావణ్య, వాణి తదితరులు పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్ వారోత్సవాలు
భిక్కనూరు : మండల కేంద్రంలోని గిద్ద హరిజనవాడలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ వారోత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యులు హాజరై గర్భిణులు, బాలింతలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏయే ఆహార పదార్థాలు తినాలో వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది జీవన, నాగేంద్రమ్మ, ప్రమీల, అంగన్‌వాడీ టీచర్ సునీత, వార్డు సభ్యురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles