రాజీతో కేసుల పరిష్కారం ఎంతో మంచిది

Sun,September 15, 2019 12:44 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : రాజీ పడి కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు మంచి జరుగుతుందని ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి అనిత అన్నారు. ఎల్లారెడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడారు. సంవత్సరాల పాటు కేసుల కోసం పోరాటం చేసేదానికంటే ఇరువర్గాలు రాజీ పడితే ఇద్దరికీ మంచిదని అన్నారు. వివిధ సందర్భాల్లో కేసులు నమోదు కావడం సహజమేనని, వాటని ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటే ఇబ్బందులు రావని తెలిపారు. కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నివేదిత దేశ్‌పాండే, న్యాయవాదులు సంతోష్ కుమార్, గోపాల్ రావు, నామ శ్రీనివాస్, నవీద్, సాయి ప్రకాశ్ దేశ్‌పాండే, పద్మ పండరి, పలువురు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles