పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

Sun,September 15, 2019 12:44 AM

భిక్కనూరు : పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని స్వచ్ఛభారత్ కేంద్ర అధికారుల బృందం సభ్యుడు జీవన్ అన్నారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి, భాగిర్తిపల్లి, జంగంపల్లి గ్రామాలను కేంద్ర బృందం సభ్యులు శనివారం సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకొని ఆరుబయట మలవిసర్జనకు స్వస్తి పలకాలని సూచించారు. చెత్తను చెత్తబుట్టల్లోనే వేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, స్వచ్ఛభారత్ జిల్లా కో ఆర్డినేటర్ శంకర్, సర్పంచ్ నర్సింహులు యాదవ్, ఉపసర్పంచ్ భాస్కర్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles