రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం

Sun,September 15, 2019 12:44 AM

విద్యానగర్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అందజేస్తున్న సేవలు అభినందనీయమని జలశక్తి అభియాన్ కేంద్ర అధికారుల బృందం సభ్యుడు అక్షయ్ కుమార్ పాండా ప్రశంసించారు. జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పర్చాలని సూచించారు. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ విభాగాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానంపై యువతకు అవగాహన కల్పించాలని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ రాజన్న, కోశాధికారి అంకన్న గారి నాగరాజు, కార్యవర్గసభ్యులు లక్ష్మణ్, సంతోష్, జగన్నాథ్‌రావు, ఎంబీ బాబన్, చంద్రకాంత్ పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles