టెండర్లకు.. వేళాయె...!

Sat,September 14, 2019 03:00 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మద్యం దుకాణాల టెండర్లకు గడువు సమీపిస్తుండడంతో జిల్లాలో సందడి మొదలైంది. దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు దృష్టి సారిస్తున్నారు. ఆబ్కారీ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరుతో వైన్ షాపుల లైసెన్సుల గడువు ముగుస్తుండగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్త లైసెన్సు విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు త్వరలోనే కొత్త లైసెన్సుల నోటిఫికేషన్ జారీ కానుంది. నూతన మద్యం పాలసీలో భారీ మార్పులు జరగబోతున్నాయని ప్రచారం సాగుతున్నది. 2017కు ముందు లైసెన్సు ఫీజుకు అదనంగా పర్మిట్ రూమ్‌కు రూ.లక్ష తీసుకునే విధానం ఉండగా ఇప్పుడు లైసెన్సు ఫీజులోనే కలిపారు. కొత్త విధానంలో పర్మిట్ రూమ్ ఉంటుందా? లేదంటే సపరేటుగా ఫీజు వసూలు చేసి అనుమతులు ఇస్తారా? అన్న ది తేలాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు, లైసెన్సు రుసు ము పెంచే అవకాశాన్ని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మ ద్యం లైసెన్సును చేజిక్కించుకునేందుకు భారీ పో టీ ఏర్పడనుంది. జిల్లాలో రెండేండ్ల కిందట జరిగిన వేలంలో 38 లైసెన్సులను దక్కించుకునేందుకు 450 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష ఫీజు చెల్లించారు. ఈ లెక్కన ఆశావహుల దరఖాస్తు రు సుము ద్వారా సర్కారుకు రూ.4.50 కోట్లు ఆదా యం చేకూరింది.

దుకాణాల పెంపు ఉంటుందా?
జిల్లాల పునర్విభజన అనంతరం జరిగిన గత పా లసీలో పలు కొత్త మండలాలకు వైన్ షాపులు కేటాయించలేదు. ఈ సారి వీటి సంఖ్య పెరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం మాత్రం కొత్త దుకాణాల పెంపుపై ఆస క్తి చూపడం లేదని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పెద్దకొడప్‌గల్, రామారెడ్డి మండలాలకు మద్యం దుకాణాలు లేవు. ప్రస్తుతం వాటి పూర్వ మండలాల్లోనే మద్యం దుకాణాలు ఉన్నాయి. మరోవైపు జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధి భారీగా విస్తరించింది. ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాలు సైతం మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. వీటిలో పలు గ్రామాలను విలీనం చేయడం ద్వారా మద్యం దు కాణాల సంఖ్య పెరుగుతుందేమోనని ఆశావహు లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం పాలసీ 2017, అక్టోబర్ 1వ తారీఖున మొదలైంది. గత పాలసీకి గడువు సెప్టెంబర్ 30వ తేదీకి ముగిసి మరునాటి నుంచే కొత్త పాల సీ అమల్లోకి వస్తుంది.

జోరుగా అమ్మకాలు...
రెండేండ్లలో జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. 38 మద్యం దుకాణాల్లో మొత్తం రూ.600 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017-2018లో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వర కు రూ.282.86 కోట్లు మేర మద్యం అమ్ముడైం ది. 2018-2019 ఆగస్టు నెలాఖరు నాటికి రూ.315.31 కోట్లు మేర మద్యం విక్రయించారు. 2018-19 ఏడాదిలో సదాశివనగర్‌లో రూ. 21.81 కోట్లు, జుక్కల్‌లో రూ.21.22 కోట్లు, లిం గంపేటలో రూ.18.59 కోట్లు మేర మద్యం అ మ్మకాలు అత్యధికంగా జరిగాయి. మొత్తం మ ద్యం అమ్మకాల్లో లిక్కర్ వాటా 85శాతం, బీర్ వాటా 15శాతంగా ఉంది. పాత మద్యం పాల సీ గడువు సమీపిస్తుండగా నోటిఫికేషన్ ఎప్పుడు వి డుదలవుతుందోనని మద్యం వ్యాపారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. పాలసీ విధానంలోని అం శాలపై ఆశావహుల్లో ఆసక్తి ఏర్పడింది. గత పాలసీలో జిల్లా కేంద్రంలోని దుకాణాలకు లైసెన్సు ఫీ జు రూ.55 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 లక్షలు చెల్లించే విధానం ఉండగా ఈ సారి కొంత మొత్తం పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles