ఘనంగా వినాయక నిమజ్జనం

Sat,September 14, 2019 02:56 AM

దోమకొండ / భిక్కనూరు : దోమకొండ, భిక్కనూరు మండల్లాలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనాన్ని శుక్రవారం నిర్వహించారు. యువకులు డప్పు చప్పుళ్ల మధ్య ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగించారు. దోమకొండలోని మండల కేంద్రంలోని గుండ్ల చెరువులో వినాయకుల విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ సతీశ్ రెడ్డి, ఎస్సై రాజేశ్వర్ గౌడ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు ప్రజలు గుండ్ల చెరువు వద్దకు చేరుకున్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles