గర్భిణులు పౌష్టికాహారాన్ని తప్పక తీసుకోవాలి

Sat,September 14, 2019 02:55 AM

విద్యానగర్ : గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని జేసీ యాదిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా దేవి కల్యాణ మండపంలో జిల్లా స్థాయి పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, జాగ్రత్తలపై జిల్లా సంక్షేమ అధికారి రాధమ్మ వివరించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కాంతమ్మ, డీపీఎం రమేశ్, రిలయన్స్ సంస్థ ప్రాజెక్ట్ అధికారి రాజేశ్, మెప్మా శ్రీధర్‌రెడ్డి, సీడీపీవోలు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles