18న జిల్లా స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ సెలక్షన్స్

Sat,September 14, 2019 02:54 AM

విద్యానగర్ : జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ సెలక్షన్స్ ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరుగు పందెం, త్రో, జంప్ అంశాల్లో అండర్ -14 బాల బాలికలు 7-11-2005 నుంచి 6-11-2007, అండర్ -16 బాలబాలికలు 7-11-2003 నుంచి 6-11-2005, అండర్ -18 బాలబాలికలు 7-11-2001 నుంచి 6-11-2003, అండర్ -20 బాలబాలికలు 7-11-1999 నుంచి 6-11-2001 మధ్యన జన్మించి ఉండాలని వివరించారు. పాఠశాల, కళాశాల నుంచి ప్రతి అంశంలో ఇద్దరు చొప్పున పాల్గొనవచ్చని సూచించారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, వయసు ధ్రువీకరణపత్రం, పదో తరగతి మెమో తప్పనిసరిగా తీసుకొని రావాలని, ఎంట్రీలు 10.30 గంటలకు ముగిస్తామని తెలిపారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles