పల్లెల్లో ప్రగతి పండుగ

Fri,September 13, 2019 03:45 AM

బాన్సువాడ/ నమస్తే తెలంగాణ : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని.. పల్లెలను ప్రగతి బాటలో పయనించేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. అన్ని గ్రామాల్లో తొలి రోజు గ్రామ సభలు నిర్వహించి.. సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. ప్రత్యేక ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని వీధుల్లో పర్యటించి.. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా పెంపొందించడం, నియంత్రిత పద్ధతిలో నిధు ల వినియోగం, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జ వాబుదారీతనం పెంచడం వంటి లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజల్లో ఆసక్తి పెరగడంతో పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కార్యక్రమం అమలు కోసం ఇప్పటికే గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అధికారులను, మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ఈ 30రోజుల ప్రత్యేక కార్యక్రమం పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను నియమించారు. వీరితో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలు ఆయా గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు.

కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా.. లేదా.. అని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుండగా.. అక్టోబర్ 6నాటికి పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.గ్రామాల్లో అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలక వర్గాలతో పాటు కొత్త ఏ ర్పాటు చేసిన స్థాయీ సంఘాల సభ్యులు, కోఆప్షన్ సభ్యులతో కలిసి పర్యటిస్తున్నారు. వీధుల్లో పాదయాత్రలు చేస్తూ.. అక్కడి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమావేశాలు నిర్వహించి.. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, కోఆప్షన్ సభ్యులు, స్థాయి సంఘాల సభ్యులు ఈ 30రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. పంచాయతీ లు, అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం ప్రజల్లో చైతన్యం రగిలిస్తోంది. దీంతో గ్రామాల్లో ప్రజలు స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి.. భాగస్వాములవుతున్నారు. దీంతో పాటు గ్రామాల అభివృద్ధికి తమవం తు సహకారం అందిస్తామని కొందరు ముందుకు వస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ వీధుల్లో నెలకొన్న సమస్యలను గుర్తిస్తుండగా.. ముఖ్యంగా నాలుగు ప్రధానాంశాలపై దృష్టి సారించారు.

పారిశుద్ధ్యంలో భాగంగా కూలిన ఇండ్లు, పాడు బడిన పశువుల కొట్టాలు, వీధుల్లో పిచ్చి మొక్కల తొలగింపు, పాడుబడిన బావుల పూడ్చివేత, నిరుపయోగంగా ఉన్న బోర్ల తొలగింపు, మురుగుకాల్వలను శుభ్రం చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్యం నెలకొల్పేందుకు, సంతలు, మార్కెట్ల ప్రదేశాలను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం, తడి, పొడి చెత్త బుట్టల ఏర్పాటు, చెత్తను డంపింగ్ యార్డుల్లోనే వేసేలా స్థానికులకు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లో మొక్కలను నాటే ప్రదేశాలను గుర్తించడం, నర్సరీలను ఏర్పాటు చేయడం కోసం స్థలాల ఎంపిక, శ్మశాన వాటికల నిర్మాణం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తించి.. పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గ్రామసభలు నిర్వహించి.. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించేందుకు నిర్ణయించారు. ఈ ప్రకారమే గ్రామాల్లో పనులు చేపట్టి.. నిధుల వినియోగం చేయనున్నారు.

అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు కోఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనటంతో.. పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.

గ్రామాలు శుభ్రంగా మారుతున్నాయి
గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల పై ప్రత్యేక దృష్టి సారించడం చాలా మంచి పరిణామం. గ్రామాలు అభివృద్ధి చెందడం ఏ ఒక్కరితోనే అయ్యే పనికాదు. ప్రతి ఒక్కరినీ 30 రో జుల ప్రణాళికలో చైతన్య పరిచారు. అధికారుల పనితీరు మెరుగుపడడంతో పాటు సర్పంచులపై బాధ్యత మరింత పెరగడంతో గ్రామాలను ఎప్పటికప్పుడు పట్టించుకుంటారు. కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
-ప్రశాంత్ కుమార్, దేశాయిపేట్

ఊర్లు మంచిగైతున్నయి
సార్లు అందరూ వస్తుండ్రు. ఊర్ల రోజు ఇంటింటికి తిరిగి చెపుతుండ్రు. చెత్తా చెదారం లేకుండా ఏరివేయిస్తుండ్రు. మస్తు రోజుల నుంచి ఉన్న చెత్త అంత తీస్తున్నరు. చాలా మంచిగా ఊరును పట్టించుకుంటున్నరు. ట్యాంకులు సాపు జేసుడు. ముళ్ల పొదలు నరికేసుడు, రోడ్డు శుభ్రం చేసి మొరం పోస్తుండ్రు. గిట్లయితే ఊర్లల జరాలు, రోగాలు రావు. మంచి పనిపెట్టిండు సీఎం సారు.
- పిట్ల నారాయణ, కొల్లూర్

బాధ్యత పెరిగింది
ఒక ఉద్యోగం చేసే వారికి ప్రత్యేకాధికారిగా నియమించడంతో విధుల నిర్వహణలో మరింత బాధ్యత పెరిగింది. గ్రామాల్లో ప్రజలతో మమేకమై సీఎం కేసీఆర్ ప్రసంగం వినిపించి, గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజలతో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ చేపడుతున్నాం.
-భానుప్రకాశ్ రెడ్డి, ప్రత్యేకాధికారి

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles