భూగర్భ జలాల పెంపే లక్ష్యం

Fri,September 13, 2019 03:41 AM

దోమకొండ / బీబీపేట / మాచారెడ్డి : భూ గర్భ జలాలను పెంపొందించేందుకే కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని జలశక్తి అభియాన్ కేంద్ర అధికారుల బృందం సభ్యులు అన్నారు. దోమకొండ మండలంలోని అంబారిపేట, అంచనూర్, బీబీపేట మండల కేంద్రంతో పాటు తుజాల్‌పూర్, యాడారం, మాచారెడ్డి మండలంలోని ఫరీద్‌పేట, పాల్వంచ, చుక్కాపూర్, లక్ష్మీరావులపల్లి, రత్నగిరిపల్లి గ్రామాలను జలశక్తి అభియాన్ కేంద్ర అధికారుల బృందం సభ్యులు అక్షయ్ కుమార్ పాండ, పద్మిని తదితరులు టెక్నికల్ అధికారి అరుంధతి, డీఆర్డీవో చంద్రమెహన్ రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. జలశక్తి అభియాన్, హరితహారం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. గ్రామాల్లో మొక్కలు నాటిన విధానం, సంరక్షణ, జలశక్తి అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు, బోర్‌వెల్స్, రీచార్జ్ ట్రెంచ్ కటింగ్ తదితర పనులు పరిశీలించారు. పనుల వివరాలను డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఫరీద్‌పేటలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లాక్ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు.

అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భూ గర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, డీఎఫ్‌వో వసంత, మాచారెడ్డి ఎఫ్‌ఆర్వో అంబర్ సింగ్, ఎంపీడీవో శ్రీకాంత్, ఏపీవో రాజేందర్, డీప్యూటీ ఆర్వో సుజాత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాచారెడ్డి కార్యక్రమాల్లో ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏపీవో అన్నపుర్ణ, పంచాయతీ సెక్రెటరీలు, బీబీపేటలోని కార్యక్రమాల్లో ఎంపీపీ బాలమణి, ఏపీవో అన్నపూర్ణ, సర్పంచులు చెన్నమనేని వెంకట్‌రావు, తేలు లక్ష్మి, ఎంపీడీవో నారాయణ, ఎంపీటీసీ రవి, టీఏ వినయ్, ఫీల్డ్ అసిస్టెంట్లు నారాయణరెడ్డి, ప్రశాంత్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles