వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

Thu,September 12, 2019 12:52 AM

భిక్కనూరు : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. భిక్కనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బస్వాపూర్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పాలొనికుంటలో చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేశారు. తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడి కాగితాల శేఖర్(12) 7వ తరగతి విద్యార్థి మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భిక్కనూరు ఎస్సై రాజుగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని గాయలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి, మెదక్‌జిల్లా రామయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles