చిన్నారులకు రోటా వ్యాక్సిన్ వేయించాలి

Thu,September 12, 2019 12:52 AM

భిక్కనూరు : డయేరియా వ్యాధి సోకకుండా ఏడాది లోపు చిన్నారులందరికీ రోటా వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్ మందు వేసి కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పుట్టిన పిల్లలు రోగాల బారిన పడకుండా, వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని అన్నారు. పుట్టిన శిశువు నుంచి 12, 13 సంవత్సరాలకు వరకు డయేరియా వచ్చే అవకాశం ఉంటుందని, పుట్టిన తర్వాత 6 వారాలకు ఒకసారి, 10 వారాలకు రెండోసారి, 14 వారాలకు మూడో సారి వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఐకేపీ అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు వ్యాక్సినేషన్‌పై అవగాహన క్పంచాలన్నారు. అనంతరం దవాఖాన ఆవరణలో మొక్కలు నాటి అందుతున్న వైద్యసేవల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి చంద్రశేఖర్, ఎంపీపీ గాల్‌రెడ్డి, సర్పంచ్ తునికి వేణు, జిల్లా వైద్యారోగ్య అధికారిణి శోభారాణి, వైద్యులు రవీందర్, సిబ్బంది ఉన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles