ఓటరు కార్డు వివరాలు సరిచూసుకోవాలి

Thu,September 12, 2019 12:52 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఈ నెల 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఓటరు పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ వివరాలను ఎన్‌ఎస్‌వీపీ పోర్టల్, ఈఆర్‌వో.నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో సరిచూసుకోవాలని కలెక్టర్ అన్నారు. జనహిత భవన్‌లో ప్రజా ప్రతినిధులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఓటరు పరిశీలన కార్యక్రమంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులు టోల్ ఫ్రీ నంబర్ 08468-1950 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఓటరు కార్డులో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయించుకోవాలన్నారు. అధ్యాపకులు విద్యార్థులకు ఓటరు పరిశీలనపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, దేవేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగరాజు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles