డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Wed,September 11, 2019 12:29 AM

సోన్‌ : నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు వస్తున్న నిర్మల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు టోల్‌ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. డ్రైవర్‌ వేగంతో నడపడంతో డివైడర్‌ను ఢీకొన్న వెంటనే బస్సులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో 16 మంది ప్రయాణికులు సీట్లలోంచి ఎగిరి కిందపడ్డారు. దీంతో డ్రైవర్‌ మనోహర్‌తో పాటు కండక్టర్‌ ఎస్‌.రమేశ్‌గౌడ్‌కు గా యాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం మర్లపెల్లి గ్రామానికి చెందిన బోలె శంకర్‌, నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన శేఖ్‌ అమిద, నిర్మల్‌కు చెందిన ఫయాసుల్లాఖాన్‌, నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌ మండలం గుత్ప గ్రామానికి చెందిన ఎం.సునీత, లక్ష్మి, నిజామాబాద్‌కు చెందిన కామారపు రమేశ్‌, షాబానా, ఆర్మూర్‌కు చెందిన దుర్గం రమేశ్‌, దుర్గం రేఖ, దుర్గం మౌనిక, నందిపేట్‌ గ్రామానికి చెందిన లక్ష్మి, ఎం.రవి, ఎం.సంధ్యకు గాయాలయ్యా యి. ప్రమాదం జరిగిన వెంటనే నేషనల్‌ హైవే అంబులెన్స్‌ తో పాటు బాల్కొండ, నిర్మల్‌కు చెందిన 108 వాహనాలు అక్కడికి చేరుకొని గాయపడ్డ వారిని నిర్మల్‌ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇందులో ముగ్గురికి బలమైన గాయాలు కావడంతో అత్యవసర చికిత్స చేసి నిజామాబాద్‌ తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే వైద్యులు సురేశ్‌, శశికాంత్‌, వేణుగోపాల్‌ దవాఖానకు చేరుకొని క్షత్రగాత్రులకు చికిత్సలు నిర్వహించారు. బస్సు ప్రమాదంలో గాయాలైన విషయాన్ని తెలుసుకున్న క్షత్రగాత్రుల బంధువు లు నిర్మల్‌ ఏరియా వైద్యశాలకు తరలిరావడంతో ఆ ప్రాంత మంతా కిక్కిరిసిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సోన్‌ ఎస్సై కె.రవీందర్‌ తెలిపారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles