రోజు41 రకాల పిండి వంటల సమర్పణ

Tue,September 10, 2019 04:07 AM

భిక్కనూరు : మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో శ్రీ వేంకటేశ్వర ఆలయ సమీపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి 41 రకాల పిండి వంటలు, స్వీట్లను సోమవారం నైవేద్యంగా సమర్పించారు. అర్చకుల ఆధ్వర్యంలో కొనసాగిన పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

యజ్ఞాలు, కుంకుమ పూజలు
విద్యానగర్ : జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లోని శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కుంకుమార్చన పూజలు చేశారు. సుభాష్‌రోడ్‌లో పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సాయి వివేకానందా గణేశ్ మండలి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు శేర్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కృష్ణహరి, చాట్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles