గాంధీ జయంతి సందర్భంగా ఉపన్యాస పోటీలు

Tue,September 10, 2019 04:07 AM

విద్యానగర్ : గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విషయ విశ్లేషణ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,7వ తరగతి విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం - పర్యావరణ పరిశుభ్రత అంశంపై, 8,9,10వ తరగతి విద్యార్థులకు గాంధీ మార్గంలో శాంతియుత జీవనం-అనుసరించాల్సిన విధానాలు అంశంపై ఉపన్యాస పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 13న పాఠశాల స్థాయి, 18న మండల స్థాయి, 21న జిల్లా స్థాయి, 25న రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఈ పోటీలు నిర్వహించి ప్రథమ స్థాయిలో నిలిచిన విద్యార్థులను మండల స్థాయికి పంపాలని, మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని జిల్లా స్థాయికి పంపుతామని పేర్కొన్నారు. ఈ నెల 21న జిల్లా స్థాయి పోటీలు దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 98489 14080, 94905 11153 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

460
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles