వారి ప్రగతి నివేదికలు సమర్పించాలి

Tue,September 10, 2019 04:07 AM

విద్యానగర్ : ఈ నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు అమలు చేస్తున్న పోషణ మాసం కార్యక్రమంలో రోజువారి ప్రగతిపై నివేదికలు సమర్పించాలని పోషణ అభియాన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ సత్యనారాయణ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, పోషకాహార లోపం లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. తల్లి, బిడ్డలకు, బాలికలకు ఇచ్చే పోషకాహారం క్రమం తప్పకుండా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మండలస్ధాయిలో ప్రజాప్రతినిధులు, సం బంధిత భాగస్వామ్య శాఖల అధికారులతో ప్రతి మొదటి, మూడో శనివారాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు రమాదేవి, తిర్మల్ గౌడ్, హన్‌రెడ్డి, అనిత, హన్మాండ్లు, చంద్రభాగ్య, డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి, సీడీపీవోలు శ్రీలత, రోచిష్మ, వైష్ణవి, సరిత, విజయలక్ష్మి, డీఈవో రాజు, జిల్లా వ్యవసాయ అధికారి నగేంద్రయ్య, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మీనారాయణ, డీపీఎం రమేశ్, మెప్మా శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles