కొత్తపేట సర్పంచ్‌పై దాడి

Mon,September 9, 2019 12:23 AM

నిజామాబాద్‌ రూరల్‌ : కొత్తపేట గ్రామ సర్పంచ్‌ లావణ్య భర్త ప్రవీణ్‌గౌడ్‌పై, వార్డుమెంబర్‌ మనోహర్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదే శం మేరకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉదయం పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్‌ లావణ్య ఆమె భర్త ప్రవీణ్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ సుదర్శన్‌, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి గంగాధర్‌, గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ స్థలంలో పెరిగిన పిచ్చిమొక్కలను వేసిన పెంట కుప్పలను ట్రాక్టర్‌ బ్లేడ్‌ సహాయంతో తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా బండారి చిన్నసాయిలు, అతని కొడుకులు మహేశ్‌, నవీన్‌ అక్కడికొచ్చి తమ పెంటకుప్పను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామంలోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తొలగిస్తు న్నామని పంచాయతీ పాలకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులతో వాగ్వాదానికి దిగిన బండారి సాయిలు అతని ఇద్దరు కొ డుకులు కలిసి సర్పంచ్‌ భర్త ప్రవీణ్‌గౌడ్‌పై చేయి వేసు కున్నారు. ఈ సమయంలో సముదాయించేందుకు ప్రయత్నించిన వార్డు మెంబర్‌ మనోహర్‌పై కూడా వారు దాడి చేశారు. ఈ సంఘటన చూసి వారిని వారించిన పంచా యతీ కార్యదర్శి గంగాధర్‌ను పరుష పదజాలంతో దూ షించారు. గ్రామపెద్దలు జోక్యం చేసుకొని సముదా యించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లతో పాటు 30 మంది రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అకారణంగా దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్యర్థి వారు కూడా తమపై దాడి చేశారంటూ బండారి సాయిలు, మహేశ్‌, నవీన్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles