భక్తి శ్రద్ధలతో సంకష్ఠహర గణపతి మహా పడిపూజ

Mon,September 9, 2019 12:22 AM

విద్యానగర్‌ : జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఉన్న సంకష్ఠహర దేవాలయంలో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మహా పడిపూజను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఆంజనేయ శర్మ, సంజీవరావు, సంపత్‌ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. స్వామి వారికి పాలు, తేనె, నెయ్యి, పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. డైలీ మార్కెట్‌లో వివేకానంద గణేశ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద కలెక్టర్‌ సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో మహిళలు కుంకుమపూజలు నిర్వహించారు. ఛత్రపతి సేన ఆధ్వర్యంలో గణేశ్‌ మండలి వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవి, అంజయ్య, పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు శేర్ల లక్ష్మణ్‌, కార్యదర్శి కృష్ణహరి, గౌరవ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్‌, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles