కులవృత్తులకు పూర్వ వైభవం

Mon,September 9, 2019 12:21 AM

భిక్కనూరు : కులవృత్తులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో ఉన్న రంగ సముద్రం చెరువులో కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి 51 వేల చేపపిల్లలను ఆదివారం వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులవృత్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారన్నారు. బెస్త,ముదిరాజ్‌ కులస్తులకు ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గంలో మొత్తం 50 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకార్మికులకు ద్విచక్ర వాహనాలు, చేపలను తరలించేందుకు ఆటోలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్నదన్నారు.

కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ... జిల్లాలో ఉన్న 550 చెరువుల్లో 3.3 కోట్ల చేపపిల్లలను విడుదల చేయడమే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 136 చెరువుల్లో 36 లక్షల చేపపిల్లలను విడుదల చేశామని తెలిపారు. మిగితా చెరువుల్లో నీరు వచ్చిన తర్వాత చేపపిల్లలు వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మత్య్సశాఖ అధికారిణి పూర్ణిమ, ఎంపీపీ గాల్‌రెడ్డి, భిక్కనూరు మత్య్సశాఖ సమీకృత అధ్యక్షుడు పోచమైన రాజయ్య, ముదిరాజ్‌ సంఘం గ్రామాధ్యక్షుడు చిన్నమద్ది సిద్దరాములు, పార్టీ మండలాధ్యక్షుడు చిట్టెడి భగవంత రెడ్డి, ముదిరాజ్‌ సంఘం మండలాధ్యక్షుడు బండి రాములు, ఎంపీటీసీ లీలావతి, బుర్రి గోపాల్‌, కర్ణాల మల్లేశం, తునికి వేణు, బాణాల అమృత రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్‌, సతీశ్‌రెడ్డి, హన్మంత్‌ రెడ్డి, తక్కళ్ల నర్సారెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అందె మహేందర్‌ రెడ్డి, ఆత్మ కమిటీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తక్కళ్ల మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles