పల్లె ప్రగతి అందరి బాధ్యత

Sun,September 8, 2019 01:09 AM

-ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
-ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలి
-అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలి
-ఇబ్రహీంపేట హరితహారంలో కలెక్టర్ సత్యనారాయణ

బాన్సువాడ రూరల్ : పల్లె ప్రగతి అందరి బాధ్యత అని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ నారాయణరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగస్వాములై స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా గ్రామాలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలని అన్నారు.

ఇండ్ల మధ్యలో నీరు నిల్వకుండా చూడాలని, మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించాలని, చెత్తబుట్టలోనే చెత్తను వేయాలని సూచించారు. గ్రామాలు శుభ్రంగా ఉన్నప్పుడే గ్రామప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణం తప్పని సరి అని, తక్షణమే స్థలాలు సేకరించి పనులు చేపట్టాలని ఆదేశించారు. కోతులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు మంకీ ఫుడ్ కోర్టుల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 109 గ్రామాల్లో 314 ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు తెలిపారు. వీటిలో నాటేందుకు 2.44లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున నాటి సంరక్షించాలని కోరారు.

శ్రమదానంలో పాల్గొన్న కలెక్టర్
అనంతరం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కార్మికులతో కలెక్టర్ శ్రమదానం చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ అధికారి అంబాజీ నాయక్, తహసీల్దార్ సుదర్శన్, ఎంపీడీవో యావర్ హుస్సేన్ సూఫీ, గ్రామప్రత్యేక అధికారి నాగేశ్వర్‌రావు, కార్యదర్శి గంగాధర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, దొడ్ల వెంకట్రాంరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ గ్రామాధ్యక్షుడు నారాయణరెడ్డి,ఉపసర్పంచ్ సాయిలు, ప్రవీణ్‌రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సాయిలు యాదవ్, రాజిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles