బ్యాంకర్లు పంట రుణాలను సకాలంలో అందజేయాలి

Sun,September 8, 2019 01:08 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : బ్యాంకర్లు ఈ నెలాఖరులోగా రైతులకు పంట రుణాలు అందజేసి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించి మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. ఆగస్టులో 46 శాతం పూర్తి చేశారని, ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని అన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలు నిర్వహించేలా కమిటీ తీర్మానం చేసింది. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి రాజేందర్‌రెడ్డి, ఎస్‌బీఐ కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్య ప్రసాద్, సిండికేట్ బ్యాంక్ కోఆర్డినేటర్ ఫణీంద్ర శర్మ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కో ఆర్డినేటర్ దయానంద్‌రెడ్డి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles