ఆరోగ్యవంతులు రక్తదానం చేయాలి

Sun,September 8, 2019 01:07 AM

బాన్సువాడ రూరల్ : ఆరోగ్యవంతులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సత్యనారాయణ కోరారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ కేంద్రంలోని పీఆర్టీయూ భవన్‌లో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. శిబిరంలో 136 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. అనంతరం పీఆర్టీయూ పాత భవనం ఉన్న స్థానంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, దొడ్ల వెంకట్రాంరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, కుషాల్, మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్వ శ్రీనివాస్, మంద ప్రవీణ్, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తిరుపతిరెడ్డి, కార్యదర్శి రాజన్న, వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles