బీబీ పాటిల్ అను నేను..

Fri,May 24, 2019 04:24 AM

-జహీరాబాద్ ఎంపీగా రెండోసారి ఘన విజయం
-కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌పై గెలుపొందిన పాటిల్
-6,166 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి
-బీబీపాటిల్‌కు 4,34,066 ఓట్లు, మదన్‌మోహన్ రావుకు 4,27,900 ఓట్లు
-రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠకు గురి చేసిన కౌంటింగ్
-పాటిల్‌ను అభినందనల్లో ముంచెత్తిన సహచర ప్రజాప్రతినిధులు
-టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు
-పటాకులు కాల్చి.. స్వీట్లు పంచిన నాయకులు

జహీరాబాద్, నమస్తే తెలంగాణ: జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై 6,166 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గురువారం పటాన్‌చెరు సమీపంలోని గీతం యూనివర్సిటీలో జహీరాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. జహీరాబాద్ నియోజవర్గంలో బీబీ పాటిల్‌కు 59,799 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుకు 83,358 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లకా్ష్మరెడ్డికి 20,038 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 11,140 ఓట్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి జహీరాబాద్ నియోజకవర్గంలో 23,554 ఓట్లు మెజార్టీ వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాణిక్‌రావుకు 34వేలకు పైగా మెజార్టీ రావడం పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ తగ్గిపోయింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా నాయకులు ప్రచారం చేయలేక మెజార్టీ తగ్గిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓట్లరకు వివరించడంలో నాయకులు విఫలమయ్యారని టీఆర్‌ఎస్ శ్రేణులు తెలుపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్ మండలాలు ఉన్నాయి. మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 3175, రెండో రౌండ్‌లో 2841, మూడో రౌండ్‌లో 2575, నాల్గో రౌండ్‌లో 2749, ఐదో రౌండ్‌లో 2912, ఆరో రౌండ్ 2534, ఏడో రౌండ్ 2673, ఎనిమిదో రౌండ్ 2662, తొమ్మిదో రౌండ్ 2442, పదో రౌండ్ 2393, 11 రౌండ్ 2749, 12 రౌండ్ 3002, 13 రౌండ్ 2787, 14 రౌండ్ 2563, 15వ రౌండ్ 2646, 16వ రౌండ్ 2678, 17వ రౌండ్ 1993, 18వ రౌండ్ 3670, 19 రౌండ్ 2260, 20వ రౌండ్ 2989, 21వ రౌండ్ 2348, 22వ రౌండ్ 2869, 23వ రౌండ్ 689 ఓట్లు రావడం జరిగింది.

అందోల్ నియోజకవర్గంలో...
అందోల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 76,945 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధన్‌మోహన్‌రావుకు 67,165 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లకా్ష్మరెడ్డికి 13,598 ఓట్లు వచ్చాయి. అందోల్ నియోజకవర్గంలో బీబీ పాటిల్‌కు 9,778 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మొదటి రౌండ్‌లో 3745, 2వ రౌండ్ 3283, 3వ రౌండ్ 3725, 4వ రౌండ్ 3440, 5వ రౌండ్ 3166, 6వ రౌండ్ 3852, 7వ రౌండ్ 3731, 8వ రౌండ్ 3445, 9వ రౌండ్ 3325, 10వ రౌండ్ 2838, 11వ రౌండ్ 3021, 12వ రౌండ్ 3423, 13వ రౌండ్ 3798, 14వ రౌండ్ 3857, 15వ రౌండ్ 3713, 16వ రౌండ్ 3685, 17వ రౌండ్ 3832, 18వ రౌండ్ 3434, 19వ రౌండ్ 2766, 20వ రౌండ్ 3393, 21వ రౌండ్ 3906, 22వ రౌండ్ 3433, 23వ రౌండ్ 132 ఓట్లు వచ్చాయి.

కామారెడ్డి నియోజకవర్గంలో...
కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌అభ్యర్థి బీబీ పాటిల్‌కు 49258 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి మధన్‌మోహన్‌రావుకు 65679, బీజేపీ అభ్యర్థి లకా్ష్మరెడ్డికి 34115 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మొదటి రౌండ్‌లో 2657, 2వ 3095, 3వ 2397, 4వ 2102, 5వ రౌండ్ 2718, 6వ 2969, 7వ 2374, 8వ 2961, 9వ 3645, 10వ 2777, 11వ 2457, 12వ 3152, 13వ 3051, 14వ 2603, 15వ 2425, 16వ 2280, 17వ 2520, 18వ 1811, 19వ రౌండ్‌లో 1264 ఓట్లు రావడం జరిగింది.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles