బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

Thu,May 23, 2019 12:51 AM

భిక్కనూరు : డ్వాక్రా సంఘ సభ్యులు బ్యాంక్ రుణాలను సద్వినియోగపర్చుకోవాలని ఆడిట్ డీఆర్డీవో సుధీర్ అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో డ్వాక్రా సంఘ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్యాంకు రుణాలు, స్త్రీ నిధి, ప్రభుత్వం ద్వారా పొందుతున్న రుణాలను సంఘ సభ్యులు సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. రుణాలతో గొర్రెలు, మేకలు, గేదెల పెంపకం, జనరల్ స్టోర్, కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న సంఘాల పనితీరును ఏపీఎం రాజయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘ సభ్యులకు రికార్డు బుక్కులు అందజేశారు. సమావేశంలో సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles