స్వచ్ఛ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దాలి

Thu,May 23, 2019 12:50 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఇటీవల విధుల్లో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని గ్రామ పంచాయతీలను పారిశుద్ధ్య సమస్యలు లేకుండా స్వచ్ఛమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని జనహిత హాల్‌లో కామారెడ్డి డివిజన్‌కు చెందిన సదాశివనగర్, కామారెడ్డి, గాంధారి, మాచారెడ్డి, భిక్కనూరు, తాడ్వాయి, దోమకొండ మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మన గ్రామం- స్వచ్ఛ గ్రామం- పచ్చగ్రామం నినాదంతో ముందుకు సాగుతూ గ్రామాలు పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నూతనంగా విధుల్లో చేరిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీల అభివృద్ధిలో ఈజీఎస్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో డీపీవో నరేశ్, డీఆర్డీఏ ఏపీడీలు శిరీష, కాంతమ్మ, అసిస్టెంట్ ఈజీవీఏ పెంటయ్య, స్వచ్ఛ భారత్ ప్రతినిధులు శంకర్, నారాయణ, ఏపీవోలు, పీఏ, ఈసీ సిబ్బంది పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles