పక్కాగా పశువుల లెక్క

Tue,May 21, 2019 12:57 AM

-గేదెలు, ఆవులకు ‘ఇనాఫ్‌' పేరిట 12 అంకెలతో జియోట్యాగ్‌
-పాల ఉత్పత్తి, ఆరోగ్యం, కృత్రిమ గర్భధారణ సమాచారం
-పశువులు దొంగిలించినా ఇట్టే దొరికిపోతాయి
-గ్రామాల్లో వివరాలునమోదు చేస్తున్నపశుసంవర్ధక శాఖ
-జిల్లాలో లక్షా86,038 పశువులు
-మొదటి విడతలో 54,413 పశువులకు‘గుర్తింపు’

కామారెడ్డి/నమస్తే తెలంగాణ: జిల్లాలో పశువుల లెక్క ఇక పక్కాగా ఉండనుంది. ప్రతీ పాడి పశువుకు ఒక గుర్తింపు నంబర్‌ ఇవ్వనున్నారు. ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఆన్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటి హెల్త్‌ (ఇనాఫ్‌) పేరిట గేదెలు, ఆవులకు 12 అంకెలతో కూడిన జియోట్యాగ్‌ వేయనున్నారు. దీంతో ప్రతీ పశువు సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనుంది. జిల్లాలో 67 వేల రైతు కుటుంబాలు ఉండగా లక్షా 86 వేల 38 పశువులు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా 54,413 పశువులకు ట్యాగ్‌ వేశారు. మిగితా లక్షా 29 వేల 255 పశువులకు ట్యాగ్‌ వేయాల్సి ఉంది. మండల పశువైద్యాధికారులు, గోపాలమిత్రలు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆవులు, గేదెలు, దూడల వయస్సు, సంతానం, వాటి ఆరోగ్య వివరాలు, పాల ఉత్పత్తి, యజమానుల వివరాలను సేకరించి పశువుల చెవులకు 12 నంబర్లతో కూడిన ట్యాగ్‌ను వేస్తున్నారు. అనంతరం వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

మనుషులకు ఆధార్‌ సంఖ్య ఉన్నట్లే.. పశువులకు 12 అంకెల ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఆన్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటి హెల్త్‌ (ఇనాఫ్‌) గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నారు. ఆవులు, గేదెల చెవులకు వీటిని గోపాల మిత్రలు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ట్యాగ్‌ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆవులు, గేదెల వివరాలను సేకరించి ట్యాగ్‌ బిగిస్తున్నారు. ప్రభుత్వం పాల ఉత్పత్తి పశువుల వివరాలను సేకరించాలనే ఉద్దేశంతో ఇనాఫ్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది నవంబర్‌ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆవులు, గేదెలు ఎవరైనా దొంగలించినా, తప్పిపోయినా ఈ విధానం ద్వారా ఇట్టే దొరికిపోతాయి. పశువుల చెవులకు వేసిన ఈ ట్యాగ్‌ ద్వారా యజమాని ఎవరు? ఏ గ్రామానికి చెందింది? అనే వివరాలు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. అక్రమ రవాణాను అడ్డుకోవచ్చని పశువైద్య శాఖ అధికారులు అంటున్నారు.

పశువులకు ఇనాఫ్‌ ట్యాగ్‌
మనుషులకు ఆధార్‌ సంఖ్య ఉన్నట్లే పశువులకు 12 అంకెల ఇనాఫ్‌ గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నారు. ఆవులు, గేదెల చెవులకు వీటిని పశుసంవర్ధక శాఖ సిబ్బంది ట్యాగ్‌ చేస్తున్నారు. గోపాలమిత్రలు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది వీటిని వేస్తున్నారు. గ్రామాల వారీగా పశువుల యజమానుల ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న ఆవులు, గేదెల వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కో పశువుకు ఒక్కో ట్యాగ్‌ బిగిస్తున్నారు. ప్రభుత్వం పాల ఉత్పత్తి పశువుల వివరాలను సేకరించాలనే ఉద్దేశంతో ఇనాఫ్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది నవంబర్‌ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో లక్షా 10 వేల పశువులకు ఇనాఫ్‌ ట్యాగ్‌లను అమర్చారు. ట్యాగ్‌ చేసిన తర్వాత పశువుల యజమానులు ఎవరికైనా పశువులు విక్రయిస్తే అలాంటి వివరాలను తమకు తెలియజేయాలని, కొనుగోలు చేసిన వారి పేరిట ట్యాగ్‌ వివరాలను మారుస్తామని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.

ఇట్టే దొరికిపోతాయి
ఆవులు, గేదెలు ఎవరైనా దొంగలించినా, తప్పిపోయినా ఈ విధానం ద్వారా ఇట్టే దొరికిపోతాయి. పశువుల చెవులకు వేసిన ట్యాగ్‌ ద్వారా పశువు యజమాని ఎవరు, ఏ గ్రామానికి చెందినదో తదితర వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా సృష్టమవుతాయి. అక్రమంగా రవాణా చేసిన పశువును తరలించిన ప్రాంతాన్ని తెలుసుకునే వెసులుబాటు సైతం ఉంది.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles