కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి

Tue,May 21, 2019 12:55 AM

బాన్సువాడ రూరల్‌ : బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 27న చేపట్టనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపులో కౌంటింగ్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి అన్నారు. మండలంలోని కొయ్యగుట్ట పీఆర్‌ గార్డెన్‌లో బాన్సువాడ డివిజన్‌స్థాయి కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లకు, రిటర్నింగ్‌ అధికారులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు ఎన్నికల నియమావళి తప్పకుండా పాటించాలని, లెక్కింపు పూర్తయ్యే వరకు పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉండొద్దని సూచించారు.

కౌంటింగ్‌ సమయంలో సిబ్బంది ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నా, చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఆందోళన చెందకుండా సమస్యను రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. లెక్కింపు సమయానికి ఒక గంట ముందు సిబ్బంది కౌటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్డీవో చంద్రమోహన్‌, ఎంపీడీవో యావర్‌ హుస్సేన్‌ సూఫీ, రిటర్నింగ్‌ అధికారులు, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలకు చెందిన ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles