‘రైతు’ దేశానికే ఆదర్శం

Tue,May 21, 2019 12:55 AM

ఖలీల్‌వాడి: తనది వ్యవసాయ కుటుంబమని, రైతు దేశానికే ఆదర్శమని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. సోమవారం నగరంలోని లలితమహల్‌ థియేటర్‌లో మహర్షి సినిమా విజయోత్సవం సందర్భంగా ఉదయం 11గంటలకు ఉచిత ప్ర దర్శన, రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలిసి రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మహర్షి సినిమాను తిలకించారు. అ నంతరం ఏర్పాటుచేసిన స మావేశంలో వారు మాట్లాడారు. చిన్నప్పటి నుంచి రైతు సాగు అంటే చాలా ఇష్టమని అ న్నారు. రైతులు చాలా కష్టపడతారని తెలిపారు. మహర్షి సినిమా జనాల కు మంచి సందేశాన్ని ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. నిర్మాత దిల్‌రాజ్‌ మంచి కథలను ఎంచుకొని నిర్మించడం అభినందనీయమన్నారు. సినిమా చూస్తుంటే పలుచోట్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకు వచ్చి దుక్కించానని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , సీఎం కేసీఆర్‌ రైతులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.

తన కుమారుడు జగన్‌ అమెరికాలో ఎంఎస్సీ చదువుకొని ఇండియాకు తిరిగివచ్చి ఇరవై ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసి పం ట పండిస్తున్నాడని గుర్తు చే సుకున్నారు. పట్టణంలో ఉన్న పిల్లలు, చదువుకునే వారికి రైతుల క ష్టం తెలియదని.. మహర్షి సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుం దన్నారు. జిల్లాలో 23 శా తం మాత్రమే అటవీ ప్రాం తం ఉందని, 30శాతం ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. చెట్లను పెం చి కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఇలాంటి సినిమాలను తీయాలని దిల్‌రాజ్‌కు తెలిపారు. సినిమా డైరెక్టర్‌ పైడిపల్లి వంశీ మాట్లాడుతూ రైతులను మర్యాదగా చూ డాలని ఈ సినిమా యొక్క భావ మని, రూపాయి టికెట్‌ సినిమా చూసిన హాల్‌లోనే స్టేజీపై ఉండ డం ఆనందంగా ఉంద న్నారు. సూపర్‌స్టార్‌ మహే శ్‌బాబు సొసైటీ కోసం, రైతుల కోసం తపించే మ నిషని సినీ నటుడు అల్లరి నరేశ్‌ అన్నారు. సొసైటీ కో సం నిర్మిం చిన సినిమానే మహర్షి అని చెప్పారు. అనంతరం పలు వురు రైతులు మాట్లాడారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడు తూ తమది కూడా 35 సంవత్సరాల క్రితం రైతు కుటుంబమే. ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి ఇ వ్వడమే ఈ సినిమా సందేశమని వివరించారు. త్వరలోనే జిల్లాకు హీరో మహేశ్‌బాబు వస్తారని తెలిపారు.

అనంతరం ప్ర భుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఒక విద్యార్థిని దత్త త తీసుకొని ప్రతి సంవత్సరం వారి పై చదువులకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నిర్మాత శిరీష్‌, నరాల సుధాకర్‌, మూఢ నాగభూషణం గుప్తా, బెజగం వెంకటేశ్‌, నాగేశ్వర్‌రావు, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఇందూరు తిరుమల సందర్శన
మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లి గ్రామ శివారులోని ఇందూరు తిరుమల దేవాలయాన్ని మహర్షి సినిమా బృందం సందర్శిం చింది. దేవాలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారు ఆలయ పూజారులతో ఆశీర్వాదం తీసుకున్నారు. సినీ నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌, దర్శకుడు వంశీ, సినీనటుడు అల్లరి నరేశ్‌, ఆలయ నిర్మాత నర్సింహారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles