కౌంటింగ్ ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

Sun,May 19, 2019 12:34 AM

సంగారెడ్డి చౌరస్తా: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని జహీరాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సూక్ష్మ పరిశీలకులకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమా న్ని నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో సూ క్ష్మ పరిశీలకుల పాత్ర ఏ విధంగా ఉంటుంది, కౌంటింగ్ హాల్‌లో ఉండే ఏర్పాట్లు, నిబంధనల మేరకు ఎలా నడుచుకోవాలి, ఈవీఎంలలో ఓ ట్లు, వీవీ ప్యాట్లలో ఓటరు స్లిప్పులను లెక్కించే ప్రక్రియ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూక్ష్మ పరిశీలకులు కౌంటింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించడంతో పాటు ఏఆర్‌వో, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌కు తమ పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరౌండ్‌కు ర్యాండమ్‌గా రెండు ఈవీఎంల ఓట్ల లెక్కింపును పరిశీలకుల సమక్షంలో క్రాస్‌చెక్ చేస్తారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ర్యాండమైజేషన్‌లో డ్రా ద్వారా ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు చేస్తారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారని, జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 23 రౌండ్లు, బాన్సువాడ నియోజకవర్గంలో అత్యల్పంగా 17 రౌండ్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ నెల 22న గీతం యూనివర్సిటీలో పరిశీలకుని సమక్షంలో సూక్ష్మ పరిశీలకులకు మరోసారి శిక్షణ ఉంటుందని తెలిపారు. అదే రోజు సంబంధితులందరికీ గుర్తింపు కార్డులను అందజేస్తామన్నారు. 23న ఉదయం 5.45 గంటల్లోగా ఐడీకార్డుతో కౌంటింగ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్‌కు సకాలంలో హాజరుకావాలని, ఎలాంటి ఆలస్యానికి తావివ్వొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సూ క్ష్మ పరిశీలకులు, నోడల్ అధికారి, వ్యవసాయశాఖ జేడీ, జహీరాబాద్ సెగ్మెంట్ ఏఆర్‌వో హమీద్, నారాయణఖేడ్ ఏఆర్‌వో అంబదాస్ రాజేశ్వర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ల ఏఆర్‌వోలు, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles