ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా వ్యవహరించాలి

Sun,May 19, 2019 12:33 AM

కామారెడ్డి, నమస్తేతెలంగాణ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓట్ల లెక్కింపు ఉన్నందున కౌంటింగ్‌లో ప్రతి నిమిషం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈనెల 20న కౌంటింగ్ సూపర్‌వైజర్లకు అసిస్టెంట్ సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి ఒక్క అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని శిక్షణలో పాల్గొన్న వారికి సూచించారు. 56 (2) ప్రకారం మొదటగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కించాల్సి ఉంటుందని, 56 (7ఏ) ప్రకారం ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓట్లను కలిపిన తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ టేబుల్ దగ్గర జరిగే మొత్తం లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ఏజెంట్లకు కనబడేలా చూడాలని అన్నారు.

ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక లెక్కింపు సూపర్‌వైజర్, ఇద్దరు లెక్కింపు సిబ్బంది ఉంటారని, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, అనుమానాస్పద ఓట్ల నిర్ణయాన్ని పరిశీలించేందుకు కౌంటింగ్ ఏజెంట్లను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద మాత్రమే కూర్చోనివ్వాలన్నారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ నుంచి కౌంటింగ్ టేబుళ్ల వద్దకు వారిని అనుమతించరాదని తెలిపారు. ప్రతి వెయ్యి ఓట్లకు ఒక రౌండ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్ హాలులో క్రమశిక్షణగా ఉండాలని, ఓటింగ్ రహస్యాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల లైజనింగ్ అధికారి సాయన్న, నోడల్ అధికారిణి షబానా, ఎంపీడీవోలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles