వైభవంగా శ్రీ లక్ష్మీనృసింహుని కల్యాణం

Sun,May 19, 2019 12:32 AM

మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం సేవాకాలం, ప్రాబోధకీ, శాంతి పాఠం తదితర పూజా కార్యక్రమాల అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మినుకూరి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలలతో పాటు సరిహద్దు జిల్లాలైన కరీంనగర్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులు కట్నకానుకాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 5 వేల మందికి అన్నదానం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్ నారాయణ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు గడ్డం సౌజన్య, ఎర్రోళ్ల నవీన్ కుమార్, జడ్పీటీసీ సభ్యురాలు గ్యార లక్ష్మి, యేలేటి గంగారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ బూక్య నర్సింహులు, హంజి నాయక్, బెంజారం నవీన్ రెడ్డి, షేక్ అజీజ్, రాజాగౌడ్, మద్దెల రాజు, ఉగ్రవాయి లకా్ష్మగౌడ్, నర్సాగౌడ్ పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ఈ నెల 11న ప్రారంభమైన శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ఆదివారం నిర్వహించనున్న చక్ర తీర్థోత్సవ కార్యక్రమంతో ముగియనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles