ఐకేపీ సంఘాల పనితీరు భేష్‌

Fri,May 17, 2019 01:18 AM

భిక్కనూరు : మండలంలోని ఐకేపీ సంఘాల పనితీరు భేష్‌ అని పంజాబ్‌ రాష్ట్ర బృందం ప్రశంసించింది. మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో డ్వాక్రా సంఘ సభ్యులతో గురువారం సమావేశమయ్యారు. మండలంలో ఉన్న డ్వాక్రా సంఘాల పనితీరుపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంఘాలకు అందిస్తున్న రుణాలు, బ్యాంక్‌ ద్వారా పొందుతున్న రుణాలు ఏవిధంగా సద్వినియోగపర్చుకుటున్నారు? వాటిని ఏ విధంగా చెల్లిస్తున్నారు ? తదితర అంశాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాము పొందిన రుణాలతో కిరాణా దుకాణాలు, జనరల్‌ స్టోర్స్‌, పాడి గేదెల పెంపకంతో లబ్ధి పొందుతున్నట్లు వివరించారు. తీసుకున్న రుణానికి ప్రతి నెలా బ్యాంకులో డబ్బు చెల్లిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. తాము కూడా తమ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు లోన్లు అందించి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా చర్యలు తీసుకుంటామని బృందం సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో డీపీఎం సుధాకర్‌, ఏపీఎం రాజయ్య, పంజాబ్‌ సిబ్బంది జస్‌బీర కౌర్‌, అమన్‌దీప్‌ కౌర్‌, హర్మన్‌దీప్‌ కౌర్‌, హరంజీత్‌ సింగ్‌, బల్‌జిత్‌ సింగ్‌, పూర్ణాజిత్‌ కౌర్‌, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles