సూపర్‌ మార్కెట్‌లో చోరీ

Fri,May 17, 2019 01:16 AM

నిజామాబాద్‌ క్రైం: జిల్లా కేంద్రంలోని శ్రీనగర్‌ కాలనీ పరిధిలోని సూపర్‌ మార్కెట్‌లో గురువారం తెల్లవారుజామున దొంగలుపడి నగదు దోచుకుపోయారు. షటర్‌ తాళం ధ్వంసం చేసి లోనికి చొరబడిన కౌంటర్‌లో ఉన్న డబ్బులను దోచుకెళ్లారు. శ్రీనగర్‌ కాలనీ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి సూపర్‌ మార్కెట్‌ నిర్వహకుడు నవీన్‌ బుధవారం రాత్రి షాపు బంద్‌ చేసి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయానే కాలనీవాసులు అతడికి ఫోన్‌ చేసి షాపు షటర్‌ ధ్వంసమైన సమాచారం అందించారు. దీంతో యజమాని తన షాపు వద్దకు వచ్చి నాల్గో టౌన్‌ పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీస్‌లు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు.
సూపర్‌ మార్కెట్‌లోకి తెల్లవారు జామున 4.06 గంటల సమయంలో ఇద్దరు దుండుగులు వినాయకనగర్‌ వైపు నుంచి సూపర్‌ మార్కెట్‌ వద్దకు వచ్చారు. అందులోంచి ఒక్కడు షాపు షటర్‌ను ఇనుపరాడుతో పైకి లేపి లోనికి ప్రవేశించాడు. మరొక్కడు షాపు బయట కాపలాగా ఉన్నాడు. లోనికి ప్రవేశించిన దుండగుడు ముఖానికి గుడ్డకట్టుకుని కౌంటర్‌లోంచి నగదు దోచాడు. ఈ తతంగం అంతా సూపర్‌ మార్కెట్‌ బయట, వెలుపల ఉన్న సీసీ కెమెరాలో రికార్డయినట్లు ఎస్సై నరేందర్‌ తెలిపారు. ఆధారాల కోసం క్లూస్‌ టీంను రప్పించారు. షాపు కౌంటర్‌లో రూ.10వేలు నగదు దోచుకెళ్లినట్లుగా బాధితుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా ఎస్సై కేసు నమోదు చేసుకొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles