ఊర చెరువులో ఇసుక నిల్వలు

Fri,May 17, 2019 01:16 AM

మాక్లూర్‌ : మండలంలోని అమ్రాద్‌ శివార్‌లోని ఊర చెరువులో గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నీరడి శ్రీనివాస్‌ అక్రమంగా ఇసుక నిల్వలను ఉంచాడని గ్రామస్తులు ఎంపీడీవో సక్రియానాయక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన గురువారం గ్రామానికి వచ్చి కుప్పలను పరిశీలించారు. ఉపాధి కూలీలతో చెరువులో మట్టి పనులు చేయిస్తుండగా ఇసుక నిల్వలు కనిపించగా ట్రాక్టర్‌ల ద్వారా తరలించి డంప్‌ చేశారన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంకు బెడ్‌ నిర్మాణానికి అవసరం ఉందని కూలీలను నమ్మించాడని తెలిపారు. ఉపాధి పనులు చేపట్టేటప్పుడు చెరువులో ఇసుక , మొరంగానీ కనిపిస్తే వాటిని వదిలి మట్టి పనులు చేయాలనే నిబంధనలకు విరుద్ధంగా 12 ట్రాక్టర్ల ఇసుకను తరలించి నిల్వ చేశాడని వీడీసీ సభ్యుల ఫిర్యాదు మేరకు డ్వామా పీడీ రమేశ్‌రాథోడ్‌కు నివేదించినట్లు ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లింగం,వీడీసీ సభ్యులు ఉన్నారు.
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
నస్రుల్లాబాద్‌: మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ లో గురువారం ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండంలంలోని దుర్కి గ్రామానికి చెందిన భూమేశ్‌, నెమ్లి గ్రామానికి చెందిన రమణ అలియాస్‌ సోని సోమవారం పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తరపు వారితో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీంతో వారి పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించామని ఎస్సై సందీప్‌ తెలిపారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles