ఆకుపచ్చ పంచాయతీగా మార్చుదాం

Thu,May 16, 2019 01:10 AM

పెద్దకొడప్‌గల్‌ : జిల్లాలోనే ఆకుప్చ పంచాయతీగా పెద్దకొడప్‌గల్‌ను తీర్చుకుందామని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వి.తిర్మల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బూర్గుపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన నర్సరీని పంచాయతీ కార్యదర్శితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీ ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. మొక్కలకు రెండు పూటలా నీళ్లు పోస్తూ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు ఎడ్ల సాయిరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో పెద్దకొడప్‌గల్‌, వడ్లం పంచాయతీ కార్యదర్శులు రమేశ్‌, రాజు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎడ్ల సాయిరెడ్డి, కారోబార్‌ పండరి, టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు బోడి మల్లికార్జున్‌ ఉన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles