మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Thu,May 16, 2019 01:10 AM

గాంధారి : హరితహారం కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని చెన్నాపూర్‌ గ్రామంలో ఈజీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ నర్సరీలో మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్న సమాచారం మేరకు పరిశీలించినట్లు తెలిపారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. నర్సరీలో 40 వేల మొక్కలను పెంచాల్సిఉండగా 10 వేల మొక్కలకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి విత్తనాలు నాటకపోవడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సాయిలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మొక్కలు మొలకెత్తకపోవడం, మొక్కల మధ్యలో కలుపు అలాగే ఉండడంతో సిబ్బందిపై మండిపడ్డారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఏర్పాటు చేసిన గ్రీన్‌ షెడ్‌ సరిగా లేకపోవడంతో సరి చేయాలని ఆదేశించారు. నర్సరీకి కంచె ఏర్పాటు చేయాలని, చిరిగిన కవర్ల స్థానంలో కొత్త కవర్లు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తరచూ పరిశీలించాలని అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నర్సీరీల్లోని మొక్కలకు ప్రతిరోజూ నీరు పోయాలన్నారు. మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో ఆనంద్‌, ఈసీ హరిబాబు, చెన్నాపూర్‌ సర్పంచ్‌ గీతా శ్రీకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌ తదితరులు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles