మగవారికి దీటుగా రాణించాలి

Thu,May 16, 2019 01:09 AM

బాన్సువాడ రూరల్‌ : సమాజంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మగవారికి దీటుగా మహిళలు రాణించినప్పడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆర్డీవో రాజేశ్వర్‌ అన్నారు. బుధవారం మండలంలోని తాడ్కోల్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 6 నుంచి 15 వరకు ఏడో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ యాదగిరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో స్త్రీలు వివక్షకు గురికావడం శోచనీయమని అన్నారు. మహిళలు పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. వాయిస్‌ ఫోర్‌ గర్ల్స్‌ సంస్థ ప్రతినిధులు విద్యార్థినుల ఎదుగుదల, నైపుణ్యాల అభివృద్ధి, తదితర అంశాలపై తరగతులు బోధించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. రాబోవు రోజుల్లో ఒక మంచి జనరేషన్‌ ప్రజల్లోకి రాబోతుందని అన్నారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. అనంతరం వాయిస్‌ ఫోర్‌ గర్ల్స్‌ బృందానికి డీఎస్పీతో కలిసి ప్రశంసా పత్రాలు, మెమోంటోను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శోభారాణి, సూపరింటెండెంట్‌ శశికాంత్‌, స్వేరో జిల్లా ప్రధానకార్యదర్శి అయ్యాల సంతోష్‌, పాఠశాల పేరెంట్స్‌ అధ్యక్షుడు గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles