యువకుల మృతదేహాలకు దహన సంస్కారాలు

Wed,May 15, 2019 01:34 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: ఈ నెల 12న అర్ధరాత్రి మండలంలోని టేక్రియాల్‌ బైపాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన విదితమే... బీహార్‌ వాస్తవ్యులు అయిన రాజసన్నీ, సంపత్‌సన్నీ బైక్‌పై నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో టేక్రియాల్‌ శివారులో డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి మృతదేహాలను 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్‌కు తీసుకవెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి బంధువుల విజ్ఞప్తి మేరకు ఇరువురికి కామారెడ్డి పెద్ద చెరువు వద్ద శ్మశాన వాటికలో మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించారు. సామాజిక బాధ్యులైన నల్లూరి రాకేశ్‌శర్మ, చక్రధర్‌రావు, నర్సింలు, దినేశ్‌ పాటిల్‌తో పాటు దేవునిపల్లి ఎస్సై శంకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రవికుమార్‌, రైటర్‌ విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles