రైతు చేతికి పట్టా

Tue,May 14, 2019 04:14 AM

-ఒక్క రోజులోనే స్పందించిన రెవెన్యూ అధికారులు
-ఆనందం వ్యక్తం చేసిన బాధిత రైతు
బీబీపేట్: నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్న బీబీపేట్ మం డలంలోని మాందాపూర్ గ్రామానికి చెం దిన చింతకుంట మధుసూదన్‌రెడ్డికి రెవెన్యూ అధికారు లు పట్టాను అందించారు. నమస్తే తెలంగాణ ధర్మగంటలో సోమవారం 2.06 ఎకరాల కోసం రెండేండ్లుగా తిప్పలు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. రెవెన్యూ అధికారులు స్పందించి మధుసూదన్‌రెడ్డికి 2.06 ఎకరాల పట్టా పాసుబుక్‌ను తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ కిష్టయ్య అందించారు. రెండేండ్లుగా పరిష్కారం కాని సమస్య ఒక్క రోజులో పరిష్కారమైందని మధుసూదన్‌రెడ్డి సమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles