వేసిన ఓటును బహిర్గతం చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష

Mon,May 13, 2019 04:02 AM

ఎల్లారెడ్డి రూరల్ : ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయడాన్ని బహిర్గతం చేయరాదని, అలా చేసిన వారికి సెక్షన్ 128 ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా పడే అవకాశం ఉందని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారుల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా తాము వేసిన ఓటును బహిర్గతం చేస్తే వెంటనే అక్కడి ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్యవేలుకు సిరాతో చుక్కను పెట్టాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా ఇతర వేలికి పెడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాన్సువాడ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడు తాను వేసిన ఓటును ఫొటో తీసినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్ నిర్వహించాలని, నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో తాగునీటి వసతితో, టెంట్ ఏర్పాటు చేయాలని, ఆరోగ్య సిబ్బందితో క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles