దరఖాస్తుల ఆహ్వానం

Sun,May 12, 2019 12:35 AM

కామారెడ్డి/నమస్తే తెలంగాణ: జిల్లాలోని గిరిజనులు బెస్టు అవైలెబుల్ స్కూల్ స్కీం 2019-2020 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియంలో 3వ, 5వ, 8వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబోజి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారాలు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు మీ సేవ ద్వారా సమర్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల వారికి సంవత్సర ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి సంవత్సర ఆదాయం రూ.2 లక్షలు మించరాదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు, పూర్వపు తరగతి ప్రోగ్రెస్ కార్డు, బోనాఫైడ్ జతపరచాలని పేర్కొన్నారు. జిల్లాలో 17 ఖాళీలకు గాను 3వ తరగతిలో 7 సీట్లు, 5వ తరగతిలో 5 సీట్లు, 8వ తరగతిలో 5 సీట్లు కేటాయించామని తెలిపారు. మొత్తం ఖాళీ సీట్లలో 33 శాతం బాలికలకు కేటాయించామని వివరించారు. బాలికలకు 3వ తరగతిలో 7 సీట్లు, 5వ తరగతిలో 5 సీట్లు, 8వ తరగతిలో 5 సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తులను ఈ నెల 10 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలని సూచించారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles