ఖైదీలు తయారు చేసిన వస్తువుల విక్రయం

Sun,May 12, 2019 12:35 AM

మాచారెడ్డి : జైళ్లలో ఖైదీలు తయారు చేసిన వస్తువులను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు జిల్లా జైళ్ల శాఖ సూపరింటెండెంట్ మధు తెలిపారు. మండలంలోని గజ్యానాయక్ తండా పరిధిలో ఉన్న ఎక్స్‌రోడ్‌లోని ఓ కిరాణ షాపులో ఖైదీలు తయారు చేసిన వస్తువులను విక్రయాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్లపల్లి, నిజామాబాద్, వరంగల్, కరీంగనర్ జైళ్లలో ఖైదీలు తయారు చేసిన వస్తువులు తక్కువ ధరకే విక్రయిస్తున్నామని చెప్పారు. ఎటువంటి రవాణా చార్జీలు లేకుండా వినియోగదారులకు అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మాచారెడ్డి ఎస్సై బోయిని మురళి, సర్పంచ్ హంజి నాయక్, ఉపసర్పంచ్ తోకల కిషన్, అస్లాం, వెంకటి గౌడ్, పరమేశ్వర్, శివలింగం, శ్రీధర్‌రావు కానిస్టేబుల్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles