మహిమాన్వితుడు శ్రీ లక్ష్మీనృసింహుడు

Sat,May 11, 2019 12:27 AM

-నేటి నుంచి బ్రహ్మోత్సవాలు..
-ఉత్సవాలకు చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబు
-19వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలు
-భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి

మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహిమాన్వితుడని, కోర్కెలను నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం 17వ శతాబ్దంలో వెలసిందని చరిత్ర చెబుతున్నది.

ఆలయ చరిత్ర..
17 శతాబ్దం నుంచి ఆలయానికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఒక పరుపు బండ ఉంది. ఆ బండ మీద రెండు పురాతన లక్ష్మీనరసింహ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల కింద నిధి ఉన్నదనే సమాచారం మేరకు పూర్వకాలం పెండారులు (ఆ కాలం నాటి దొంగలు) స్వామి వారి ఆలయ గడప ముందు నల్లని గోమాతను బలి ఇచ్చారు. ఆవును బలి ఇవ్వడంతో పాటు విగ్రహాన్ని పెకిలించి తీయడంతో నరసింహస్వామి ఆగ్రహించి గర్జించిన శబ్దం వినబడడంతో దొంగలు భయపడి విగ్రహాన్ని ఆలయ సమీపంలో ఉన్న మంగబావిలో పడేసి పారిపోయారు. ఎప్పటిలాగే మరుసటి రోజు పూజ చేసేందుకు ఆలయం వద్దకు అర్చకులు రాగా అక్క డ విగ్రహం లేదు.

ఆ రోజు ఆలయ అర్చకులకు స్వామి వారు కలలోకి వచ్చి ఆలయానికి సమీపంలో ఉన్న మంగబావిలో ఉన్నానని చెప్పడంతో చుక్కాపూర్ గ్రామస్తులంతా కలిసి మంగబావిలో నుంచి స్వామి వారి విగ్రహాన్ని తీసి తెల్లని గుర్రంపై విగ్రహాలను తీసుకువస్తుండగా ఓ స్థలం వద్ద గుర్రం ఆగిపోయింది. గుర్రాన్ని ఎంత కొట్టినా అక్కడి నుంచి కలదకపోవడంతో ఆకాశం నుంచి నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి అనే శబ్దం రావడంతో స్వామి వారిని అక్కడే ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారని, అదే చుక్కాపూర్ లక్ష్మీనృసింహ స్వామి ఆలయమని పూర్వీకులు చెబుతారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles