న్యాయశాస్త్ర విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్

Fri,May 10, 2019 11:36 PM

-స్రవంతికి డాక్టరేట్
డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండ్ల స్రవంతికి ఏప్రిల్ 17న కాకతీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర కళాశాలకు చెందిన ప్రొఫెసర్ వై.పద్మజారాణి మార్గనిర్దేశంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజిమ్ ఏ క్రిటికల్ స్టడీస్ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను పీహెచ్‌డీ ప్రదానం చేశారు. డాక్టరేట్ పొందిన బి.స్రవంతి తెలగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్ర కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఐదు సంవత్సరాలు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు దాదాపు నాలుగు సంవత్సరాలు న్యాయశాస్త్ర విభాగంలో అకాడమిక్ కన్సల్టెంట్‌గా కూడా ఈమె బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహానికి వార్డెన్‌గా, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా సేవలు అందించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర విభాగంలో డాక్టరేట్ పట్టాను సాధించిన స్రవంతిని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ఆచార్య డి.బలరాములు, న్యాయశాస్త్ర విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ జట్లింగ్ ఎల్లోసా, డాక్టర్ ప్రసన్నరాణి, డాక్టర్ నాగజ్యోతి, ఇతర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles