టీఎస్ ఆర్టీసీలో టెండర్ల ఆహ్వానం

Fri,May 10, 2019 11:36 PM

ఖలీల్‌వాడి: నిజామాబాద్ రీజియన్ పరిధిలోని బస్టాండ్‌లో మేజర్, ఏ, బీ, సీ బస్‌స్టేషన్లలో ఖాళీగా ఉన్న షాపులు, స్థలం, టాయిలెట్స్, లైసెన్స్, కాంట్రాక్ట్ జారీ చేయడానికి టెండర్లు స్వీకరిస్తున్నామని రీజినల్ మేనేజర్ సులేమాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ ఫారాలను ఈ నెల 13వ తేదీ నుంచి 21వరకు డిపో మేనేజర్ కార్యాలయంలో పొందవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు పూర్తి చేసిన ఫారాలను రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఉంచిన టెండర్ బాక్సులో ఈ నెల 22న సాయంత్రం 4 గంటల్లోపు దాఖలు చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles