కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

Fri,May 10, 2019 11:36 PM

బీబీపేట్ : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంతో పాటు యాడారం, ఇస్సానగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా, మద్దతు ధర అందజేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో రైతులకు టెంటు, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కాంటా చేసిన తర్వాత రైతులను ఇక్కడే ఉండాలని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీవో మమత, సీఈవో నర్సాగౌడ్, ఆర్‌ఐ అంజయ్య, సొసైటీ సిబ్బంది రంగారెడ్డి, బాల్‌రాజ్, నర్సింహులు, రవి, స్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles