ఆలయాన్ని దర్శించుకున్న సినీ దర్శకుడు

Fri,May 10, 2019 11:36 PM

బీర్కూర్ : మండలంలో తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీనివాస్‌రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మేనేజర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... ఢమరుకం, మామ మంచు అల్లుడు కంచు, అఆఇఈ తదితర సినిమాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. ఈ ఆలయం బాగుందని విని స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చాయని, ఇక్కడ కూడా ఒక సినిమా తీయాలన్న ఉద్దేశంతో ఆలయ పరిసరాలు పరిశీలించినట్లు తెలిపారు. బీర్కూర్ ఉమ్మడి మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానం, నెమ్లిలోని సాయిబాబా ఆలయం, మైలారం శివారులోని కొచ్చెర మైసమ్మ ఆలయాల వద్ద సినిమా షూటింగ్ చేస్తామని వివరించారు. ఆయన వెంట ఆలయ మేనేజర్ ఆకుల మురళి, చుంచు సాయిలు యాదవ్ ఉన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles