మరో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

Fri,May 10, 2019 02:36 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : రైతులకు ఇబ్బంది కలుగకుండా కామారెడ్డి మార్కెట్ యార్డులో మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కో-ఆపరేటివ్ అధికారి మమతను కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ మార్కెట్ యార్డు, దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించి ఆక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. రైతులతో, హమాలీలతో మాట్లాడారు. ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను, నలుగురు అదనపు సిబ్బందిని కేటాయించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా సరఫరాల అధికారి కొండల్‌రావును ఆదేశించారు.

సీరియల్ నంబర్ ప్రకారం కొనుగోలు చేయాలి...
రైతుల నుంచి ధాన్యాన్ని సీరియల్ ప్రకారం కొనుగోలు చేయాలని, ఇందులో అవకతవకలు జరిగినా, కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతును అక్కడే ఉంచితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మార్కెట్ యార్డు సిబ్బందిని హెచ్చరించారు. ధాన్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని, ఒక వేళ రైతే స్వయంగా రవాణా సౌకర్యం కల్పించుకుంటే రవాణా ఖర్చులు అందజేస్తామని తెలిపారు. దోమకొండ మార్కెట్ యార్డులో గురువారం సాయంత్రంలోగా అదనంగా వాహనాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కాంటాకు ఎత్తాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రైతులకు హమాలీలు సహకరించాలని, హమాలీల సంఖ్యను పెంచి త్వరగా ధాన్యాన్ని కాంటాకు ఎత్తాలని సూచించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, తహసీల్దార్లు, జిల్లా సరఫరాల శాఖ, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు, మార్కెట్ యార్డు సిబ్బంది తదితరులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
దోమకొండ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, డీసీవో మమత, తహసీల్దార్ సతీశ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, సీఈవో బాల్‌రెడ్డి, వీఆర్వో రమేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles